Telugu Directors : ఏ రంగంలోనైనా సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఉంటుందో ఉండదో చెప్పలేం కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం తప్పక సెంటిమెంట్లకు ఉండే ప్రాధాన్యత ఉంటుంది. మళ్లీ ఆ సెంటిమెంట్ అంతా అంతా కాదు.చాలా మంది డైరెక్టర్లు ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాకు ఫాలో అయిన వాటినే ఇతర సినిమాల్లో కూడా అనుసరించటానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అలానే సినిమా సక్సెస్ అయినప్పుడు ఏం చేశామనే దానిని కూడా ఫాలో అవుతుంటారు. అది సెంటిమెంట్ అని వారు అనుకుంటే ఇంకొందరు కో ఇన్సిడెంట్ అంటారు. ముందుగా దర్శకులలో త్రివిక్రమ్ సెంటిమెంట్ చూస్తే ఆయన సినిమా టైటిల్స్ అన్నీ ఎక్కువగా ‘అ’ తోనే స్టార్ట్ అవుతున్నాయి. తన కెరీర్ బిగినింగ్ లో వచ్చిన ‘అతడు’ మూవీ నుంచి ఇటీవల ‘అల వైకుంఠపురం’ వరకు అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు త్రివిక్రమ్.
ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఒక మూవీ చిత్రీకరణ పూర్తి అయ్యాక తిరుపతి కి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటారు అలాగే ఒక మూవీ పూర్తి అయ్యేవరకు గడ్డం తియ్యరు. కళాతపస్వి విశ్వనాధ్ తన సినిమాలన్నిటికీ ఎక్కువగా ‘ఎస్’ అక్షరం తోనే తీస్తారు. అంతే కాకుండా షూటింగ్ ఉన్నంత కాలం కాకి దుస్తులే ధరిస్తారు.అలానే సినిమాల్లో ఒక్క షాట్ అయినా గోదావరి తీరం లో తీస్తారు. విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వంశి ఎక్కువగా తన చిత్రాలను విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తారు. అలాగే ఆయన సినిమాల్లో హీరోయిన్లకు పెద్ద బొట్టుని పెడతారు. కృష్ణవంశీ చిత్రాల్లో ఎక్కువగా పెద్ద ఉమ్మడి కుటుంబాలే ఉంటాయి.
మాస్ డైరెక్టర్ వినాయక్ సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్లకు నందిని అనే పేరు పెడుతుంటారు. అలానే డాషింగ్ డైరెక్టర్ తన సినిమాలకు సంబంధించిన స్టోరీ లు, స్క్రిప్ట్ లు రాయడానికి బ్యాంకాక్ వెళ్తాడు. ఇది అందరికి కామన్‌గా తెలిసిన విషయం. కరుణాకరన్ తన సినిమాల్లో హీరోయిన్ ఎంట్రీ షాట్ లో వైట్ డ్రెస్ ఉంటుంది. విక్రమ్ కే కుమార్ తన సినిమాలన్నిటిలో హీరోయిన్ పేరు ప్రియా నే.. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి.. తన ముందు సినిమాలో హీరోయిన్ కి తదుపరి చిత్రం లో ఏదొక రోల్, లేకపోతే స్పెషల్ సాంగ్ అయినా చేయిస్తారు. కోడి రామకృష్ణ.. షూటింగ్ సమయంలో తలకి ఒక క్లాత్ కట్టుకొని కనిపించేవారు. లోకేష్ కనగరాజ్.. తెరకెక్కించే చిత్రాలలో ప్రధాన పాత్రల్లో ఒక జంట ఉంటే వారిలో ఒకరు ఖచ్చితంగా చనిపోతారు.