Bhediya Movie : ఇటీవల కాలంలో థియేటర్లో విడుదలైన చిత్రాలన్నీ ఓటీటి లో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలా ఇప్పటివరకు దసరా, బలగం, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి చిత్రాలకి ఓటీటీలోను మంచి ఆదరణ దక్కింది. అయితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా సరే నాలుగు వారాలు గడిచిందంటే చాలు ఓటీటి లోకి వచ్చేస్తుది. కాని ఈ సినిమా మాత్రం ఆరు నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమవుతుంది. మరి ఆ సినిమా ఏంటంటే.. వరుణ్ ధావణ్ హీరోగా నటించిన భేదియా మూవీ. తెలుగులో దీన్ని ‘తోడేలు’ పేరుతో విడుదల చేశారు. తెలుగులో గీతా ఆర్ట్స్‌కు చెందిన గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేసింది.
వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హిందీ సినిమా ‘భేడియాకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించింది. అయితే అనుకున్న స్దాయిలో ఈ సినిమా వర్కవుట్ కాలేదు. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీ ‘తోడేలు కాగా,ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో రూపొందించారు. గన్ మెర్విక్, గాడ్జిలా వెర్సస్ కింగ్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ అందివ్వడం జరిగింది. మనిషి తోడేలుగా మారడం, అడవి, అడవిలో పున్నమి వీటన్నింటినీ చాలా సహజంగా, ఒళ్ళుగగుర్పొడిచే విధంగా చిత్రీకరించారు.
తోడేలు దూకేటప్పుడు.. అరిచేటప్పుడు.. ఇలా చాలా సందర్భాల్లో మంచి విజువల్ ట్రీట్ కలుగుతుంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక జియో సినిమాలో మే 26వ తేదీ నుంచి ‘భేదియా’ విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భేదియా 2’ కూడా రానుంది. తోడేలుగా మారిన వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో ‘భేదియా’ సినిమాలో చూపించారు. మరి సీక్వెల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీక్వెల్‌కి సంబంధించిన నాయిక, దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాను 2025లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.