Mrunal Thakur : బెంగాలీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రంలో హీరోయిన్ గా చేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సీతగా స్థిరస్థాయిలో ముద్ర వేసుకుంది. తెలుగులో చేసింది మొదటి సినిమా అయినా విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా హాట్ బ్యూటీలకు మించి ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తోంది. మృణాల్ అందాలు చూసి ప్రతి ఒక్కరు తన్మయత్వం చెందుతున్నారు. ఈ అమ్మడు మొదట్లో సీరియళ్ల ద్వారా బుల్లితెరపైకి తెరంగేట్రం చేసింది. 2021లో ‘ముజ్కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్’ అనే ధారవాహిక ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి తన నటనతో ఆకట్టుకుంది.
అలా సీరియళ్లలో లీడ్ రోల్స్ చేస్తూ ఎంతో పాపులర్ అయిన స్టన్నింగ్ బ్యూటి మృణాల్ తర్వాత సినీ అవకాశాలు అందుకుంది. ‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంలో మొదటగా అవకాశం అందుకుంది. ఈ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై డెబ్యూ చేసిన ఈ బ్యూటీనటనపరంగా తానేంటో అప్పట్లోనే నిరూపించుకుంది. సీతారామంతో ఎంతో మంది మనసులు గెలుచుకుంది. మరాఠీ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మణాల్ హిందీలో లవ్ సోనియా, బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, రాధా, తదం వంటి మూవీస్ చేసి అలరిచింది.
సీతారామంలో సీతగా అలరించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఫొటోలు షేర్ చేస్తుంది. వీటిని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా తాను స్వర్గంలోనే ఉంటాను అని అర్థం వచ్చేలా ఒక కామెంట్ పెట్టి కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె ఒకపక్క ఎద అందాల ఆరబోస్తూనే మరో పక్క తన బాడీ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. సీతలా కనిపించిన మృణాల్ ఇలా రచ్చ చేస్తుండే సరికి అభిమానులు కొందరు అప్సెట్ అవుతున్నారు.