Niharika : మెగా బ్రదర్ నాగబాబు ముద్దులు కూతురు నిహారిక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు సినిమాలతో తెగ సందడి చేసిన నిహా ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి నిర్మాతగా సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిహారిక చేసే సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. కొద్ది రోజులుగా నిహారిక కొణిదెలపై అనేక రూమర్లు వస్తున్నాయి. నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడిపోయారని, వారు విడాకులు తీసుకోబోతున్నట్లు టాక్ వచ్చింది. తాజాగా నిహారిక ప్రెగ్నెంట్ అని కొత్త రూమర్ బయటకు వచ్చింది.
అందుకు కారణం నిహారిక తాజా పుల్లని మామిడి పండ్లను తింటున్నట్లు వీడియోలో కనిపించడం. ఇటీవలి ఆమె మామిడికాయ తింటున్న వీడియో నెట్టింట వైరల్ కాగా, ఈ వీడియో చూసినవారంతా నిహారిక ప్రెగ్నెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలో నిహారిక శుభవార్త చెప్తుందని భావిస్తున్నారు. . నిహారిక నువ్ ప్రెగ్నెంట్‌వా? గర్భం దాల్చావా? శుభవార్త చెప్పబోతోన్నావా? అంటూ నానా రకాలుగా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. అయితే వీటికి నిహారిక ఏ మాత్రం కూడా స్పందించడం లేదు. మొత్తానికి ఈ మామిడి కాయలు తినడంతో నిహారిక పేరు నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే నిహారిక పర్సనల్ లైఫ్ ఇప్పుడు గందరగోళంగా ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది.. భర్త చైతన్యతో ఉన్న ఫోటోలను షేర్ చేయడం లేదు.. మరో వైపు చైతన్య అయితే పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడం, ఈ ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే అనుమానాలు రేకెత్తిస్తుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియడం లేదు గానీ.. ఈ ఇద్దరూ కలిసి ఉండటం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు అయితే జిమ్‌కి కూడా కలిసి వెళ్లేవాళ్లు. కాని ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. దీనిపై కనీసం నాగబాబు అయిన స్పందిస్తే బాగుండని అంటున్నారు.