Shriya Saran : అలనాటి అందాల తార శ్రియ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. దాదాపు ఇరవై యేళ్లుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అంతేకాదు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు.తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రియ.. టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్ స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి తన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.
కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఈ అమ్మడు సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కింది. రష్యాకు చెందిన ఆండ్రీ కోషీవ్ ని శ్రియ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆండ్రీ బిజినెస్ తో చాలా కాలం డేటింగ్ చేసిన ఈ జంట 2018 మార్చి 19న ముంబైలో వివాహం చేసుకున్నారు. శ్రియ-ఆండ్రీ పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. అయితే నేడు పెళ్లి రోజు కావడంతో శ్రియ శరన్ ఇంస్టాగ్రామ్ లో తన ఆనందం అభిమానులతో పంచుకున్నారు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఆండ్రీ… అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు తన పెళ్లికి సంబంధఙంచిన కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది.
శ్రియ 2020లో ఒక పాపకు జన్మనివ్వగా, చాలా రోజుల తర్వాత ఆ విషయాన్ని అందరికి తెలియజేసింది. లాక్ డౌన్ సమయం కావడంతో శ్రియ గర్భం దాల్చిన విషయం బయటకు రాలేదు. ఆమె గర్భవతి కావడం, పాపను కనడం ఎవరికీ తెలియకుండా జరిగిపోయాయి. అనంతరం ఈ విషయాన్ని శ్రియ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. శ్రియ కూతురు పేరు రాధ కాగా, అప్పుడప్పుడు ఆమెకు సంబంధించిన వీడియోలని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. సినిమాల విషయానికొస్తే.. శ్రియ గతేడాది .. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది. ఆ తర్వాత దృశ్యం2లో మరోసారి అజయ్ సరసన మెరిసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది.